'త్వరలో జర్నలిస్టుల డిమాండ్లు పరిష్కారం'
విశాఖ డాబాగార్డెన్స్‌లో ఎన్ఏజే జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. అలాగే, 13 డిమాండ్లు మంత్రికి వినిపించగా, కొన్ని త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్, బీమా వంటి అంశాలపై ముందడుగు పడనుంది.