ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం రాయితీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం రాయితీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

HYD: ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం వరకు రాయితీ ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 13న ఎలాంటి లోక్ అదాలత్ నిర్వహించడం లేదని.. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదని వారు తెలిపారు. ప్రజలు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించారు.