'నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలి'
GNTR: నీటి పథకాలు ముఖ్యంగా సీపీడబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో గ్రామీణ నీటి సరఫరా పథకాలపై ఆమె ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, అందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.