ఘనగా శ్రీరామనవమి వేడుకలు

ఘనగా శ్రీరామనవమి వేడుకలు

KMM: ఏన్కూరులో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రామాలయాల ప్రాంగణంలోని చలువ పందిళ్ల కింద అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ  అద్భుత క్రతువును వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.