క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్

క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్

HNK: హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. తొలి రోజు 27 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారన్నారు. ఈనెల 14లోగా పాఠశాల ప్రారంభం కానుందని తెలిపారు.