రైతు భరోసా కేంద్రాల అకస్మిక తనిఖీ

KkDP: సిద్దవటం మండలంలోని బొగ్గిడివారి పల్లె, ఉప్పరపల్లె రైతు భరోసా కేంద్రాలను మంగళవారం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.నాగరాజు ఆకస్మిక తనిఖీ చేసి పలు కార్డులను పరిశీలించారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని సుస్థిర ఆదాయం పొందేలా సిబ్బంది కృషి చేయాలని ఆయన ఆదేశించారు. రైతు సేవాకేంద్రం వ్యవసాయ సంచాలకులు బొగ్గిడి సందీప్, తదితరులు పాల్గొన్నారు.