శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత
NZB: SRSP నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 16 వరద గేట్ల ద్వారా 47,059 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 56,513 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టంతో 80.501 TMCల నీరు నిల్వ వుంది.