ఉగ్రవాదుల దాడికి నిరసనగా పామూరులో కొవ్వొత్తుల ర్యాలీ

ప్రకాశం: పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ గురువారం పామూరులో ఆర్యవైశ్య సంఘ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని మమ్మీ డాడీ సెంటర్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి మృతులకు సంతాపం తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా దాడులు చేయడం పిరికిపంద చర్య అన్నారు.