ఈదురు గాలులతో వర్షం.. విద్యుత్ సరఫరా బంద్

HYD: హయత్ నగర్‌లో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో వచ్చిన గాలి వానకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల కాలనీలలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.