ఎమ్మెల్యేకు రైతుల వినతి పత్రం

HNK: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కింద భూములు పోతున్న రైతులు వినతి పత్రం సమర్పించారు. రైల్వే ఫ్యాక్టరీ వల్ల భూములను కోల్పోయిన రైతు కుటుంబాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు