ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఆరోగ్యశాఖ అధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన ఆరోగ్యశాఖ అధికారి

NLR: ఇందుకూరుపేట(మం) జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రాత్రి వేళల్లో వచ్చిన గర్భిణీ స్త్రీలకు అత్యవసర వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో కాన్పులు ఎక్కువ జరిగేటట్లు చూడాలన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.