'ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి, విధుల్లో చేరేలా చూడాలి'
MNCL: మందమర్రి ఏరియాలోని వివిధ గనులలో సంక్షేమ అధికారులతో DGM (పర్సనల్) అశోక్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2022 నుంచి 2025 వరకు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉద్యోగుల పరిస్థితిని క్షుణ్ణంగా చర్చించారు. దీర్ఘకాలికంగా విధులకు దూరంగా ఉంటున్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించి, విధుల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు.