'MLCల రాజీనామా.. విచారణ కొనసాగుతోంది'

'MLCల రాజీనామా.. విచారణ కొనసాగుతోంది'

AP: MLCల రాజీనామా అంశం కోర్టు పరిధిలో ఉందని శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. తన పరిధి మేరకు రాజీనామా చేసిన MLCలను విచారించానని తెలిపారు. ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు. సెషన్‌తో సంబంధం లేకుండా అవిశ్వాసం పెట్టొచ్చన్నారు. ఎవరు ఏది అనుకుంటే అదే తన మతమని పేర్కొన్నారు.