'కనిగిరిలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం'

ప్రకాశం: కనిగిరి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 ఎకరాల అసైన్డ్, ప్రైవేట్ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కేశవరావు డిమాండ్ చేశారు. శుక్రవారం తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.