జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం

జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం

రిలయన్స్ జియో నెట్‌వర్క్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యూజర్లు మొబైల్ డేటా, ఫోన్ కాల్స్ సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. మ.4:54 గంటలకు డౌన్‌డిటెక్టర్ అనే అవుటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లు ఫిర్యాదు చేశారు. 55% మంది ఇంటర్నెట్, 33% మంది జియోఫైబర్ సమస్యలను, 12% మంది సిగ్నల్ లేని సమస్యను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.