'మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్'
TPT: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో తిరుపతి పోలీస్ మైదానంలో మహిళల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్‌లో మహిళలకు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్‌లో పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.