VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

PLD: దాచేపల్లి-మాచర్ల క్రాస్ రోడ్డు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు వేగంగా వస్తున్న కారు మొదట ఒక బైక్‌ను, అనంతరం ఒక ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే పిడుగురాళ్లలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.