ప్రిజ్, వాషింగ్ మిషన్ వస్తున్నాయని మోసం

ప్రిజ్, వాషింగ్ మిషన్ వస్తున్నాయని మోసం

GNTR: పట్టణంలోని అశోకనగర్‌కు చెందిన వృద్ధురాలు రమణ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి చంద్రబాబు తరఫున ప్రిజ్, వాషింగ్ మిషన్ వస్తున్నాయని నమ్మించారు. పసుపు చీరపై నగదు పెట్టి ఫొటో దిగాలని మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆమె పసుపు రంగు చీరపై రూ.లక్ష పెట్టింది. మోసగాళ్లు ఎరుపురంగు చీర కూడా కావాలని అడగడంతో ఆమె లోపలకు వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేసరికే దొంగలు పారిపోయారు. దీంతో ఆమె పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు.