మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాన్ కంట్రోల్ రూమ్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రపురంలో తుఫాను సహాయ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.