VIDEO: ఇల్లు దహనం.. కట్టుబట్టలతో మిగిలిన దంపతులు
అన్నమయ్య: కోడూరు మండలంలోని రెడ్డివారిపల్లిలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దేవుడి పటం వద్ద వెలిగించిన దీపం కిందపడటంతో మంటలు చెలరేగి లక్ష్మీదేవి, వెంకటేశ్వర్లు ఇంటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. దంపతులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. స్థానికులు, అధికారులు బాధితులకు సహాయం అందించాలని కోరుతున్నారు.