ఉదయం 7 నుంచి పోలింగ్: కలెక్టర్ రాజర్షిషా
ADB: జిల్లాలోని ఆరు మండలాల్లో ఈనెల 11న గురువారం జరిగే మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొని, ఉదయం 7 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.