రోడ్డు ప్రమాదంలో PACS ఉద్యోగి మృతి
WNP: హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఘనపూర్ PACSలో విధులు నిర్వహిస్తున్న అల్లమయిపల్లికి చెందిన యుగంధర్ గౌడ్ (28) మృతి చెందారు. ఆయన అకాల మరణంపట్ల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. యుగంధర్ గౌడ్ మృతిపట్ల మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయకుమార్, కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.