'వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించుకోవాలి'

ప్రకాశం: కనిగిరి డివిజన్ పరిధిలో అన్ని గ్రామంలో ఈనెల 27 న జరగనున్న వినాయక చవితి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు ముందుగా పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అనుమతి తీసుకోవాలన్నారు. మండపాలలో సౌండ్ సిస్టమ్ రాత్రి 10 గంటల తరువాత ఆపివేయాలని తెలిపారు.