మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
ELR: కులరహిత సమాజంతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం ఏలూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్షతను రూపుమాపేందుకు కృషిచేశారని వివరించారు.