నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VSP: ఈ. భోనంగి AP TRANSCO 220కేవి సబ్ స్టేషన్ నిర్వహణ పనుల్లో భాగంగా పరవాడ, వాడచీపురుపల్లి, వెంకటాపురం, పెదముషిడి వాడ సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనుందని APEPDCL ఈఈ పీ. మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు.