తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: జిల్లా ఉపాధ్యాక్షుడు

NRPT: గురువారం మఖ్తల్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అసలే వర్షాభావ పరిస్థితుల వల్ల మరియు రోగాల భారినపడి దిగుబడి తగ్గిపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులు పెట్టిన పెట్టుబడి రాక లబోదిబోమంటున్నారని అన్నారు.