VIDEO: 'తలసేమియా చిన్నారులకు రక్తదానం చేయడం అభినందనీయం'
కామారెడ్డి: తలసేమియా చిన్నారులకు దాతలు రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కర్షక బీడీ కళాశాలలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని కొనియాడారు. రక్తదానం చేసిన దాతలకు హెల్మెట్లను ప్రదానం చేస్తారని చెప్పారు. ఈ కార్యకరమంలో యువకులు పాల్గొన్నారు.