క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
ప్రకాశం: రాచర్ల మండలం కాలువపల్లి గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి 21వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులతో క్రికెట్ ఆడి ఉత్సాహాన్ని నింపారు.