VIDEO: రూ. 2.50 లక్షల ఎల్‌వోసీ అందజేత
హన్మకొండ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్‌వోసీ కాపీని బాధిత కుటుంబానికి అందజేశారు. హసన్ పర్తి గ్రామానికి చెందిన పిథిమి నాగమణి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఈ ఎల్‌వోసీ ద్వారా హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేశారు.