ఘనంగా రంజాన్ వేడుకలు

ఘనంగా రంజాన్ వేడుకలు

MDCL: న్యూ బోయినపల్లి సంచారపురి కాలనీలోని కాంగ్రెస్ నాయకులు హజ్మత్ హుస్సేన్ నివాసంలో రంజాన్ పండుగ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్‌లు ముఖ్య అతిధిలుగా హాజరై ఆయన కుటుంభసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు షీర్ కుర్మా సేవించారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించారు.