'9న రాజమండ్రిలో వైసీపీ నిరసన కార్యక్రమం'
E.G: ఈనెల 9న రాజమండ్రిలో వైసీపీ శ్రేణులు, రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. అనపర్తి వైసీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.