సూర్యాపేటలో 30 పోలీస్ యాక్ట్ అమలు

సూర్యాపేటలో 30 పోలీస్ యాక్ట్ అమలు

SRPT: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఫిబ్రవరి 28 వరకు ‘30 పోలీస్ యాక్ట్’ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయవద్దని, డీజేలు, బాణాసంచాకు అనుమతి లేదని అన్నారు.