BREAKING: డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన అయ్యప్పలు
TG: రాష్ట్ర డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ.. అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ ఆఫీస్‌ను ముట్టడించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్న పలువురు స్వాములను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.