రేపు జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు
కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని బాస్కెట్‌బాల్ ఎరీనాలో రేపు జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ విభాగాల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు దాదాభాష, మురళి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.