VIDEO: శ్రీ కళ్యాణవెంకన్న స్వామి హుండీ ఆదాయం రూ.6 లక్షలు
CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణవెంకటరమణ స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ. 6 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్స్‌పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు 6,37059 రూపాయలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం మూడు నెలలు పాటు భక్తులు హుండీల సమర్పించిన కానుకలని చెప్పారు.