రేపు నగరపాలకలో పబ్లిక్ గ్రీవెన్స్

KRNL: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నగర పాలకలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. నగర పరిధిలోని ప్రజలకు తమ కాలనీల్లో ఏవైనా సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.