తిమ్మాపూర్‌లో రైతు నేస్తం కార్యక్రమం
KNR: తిమ్మాపూర్ మండలంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత, పోషక ఆహార మిషన్ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.