దళారులను నమ్మి మోసపోవద్దు: ఛైర్మన్

దళారులను నమ్మి మోసపోవద్దు: ఛైర్మన్

MHBD: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని PACS ఛైర్మన్ మనోహర్రావు అన్నారు. నెల్లికుదురు PACS ఆధ్వర్యంలోని నైనాల, బ్రాహ్మణ కొత్తపెళ్లి, బొడ్లాడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సీఈఓ బంధారపు యాదగిరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.