అతివేగానికి రూ.1.3 కోట్ల భారీ జరిమానా..!
ఫిన్లాండ్‌లో ఆండర్స్ విక్లోఫ్ అనే వ్యాపారి వేగంగా వాహనం నడిపినందుకు రూ.1.3 కోట్ల భారీ జరిమానా కట్టాల్సి వచ్చింది. గంటకు 30 కి.మీ వేగ పరిమితి ఉన్న చోట 59 కి.మీ. వేగంతో వెళ్లడమే ఇందుకు కారణం. అక్కడ ఆదాయం ఆధారంగా జరిమానాలు విధిస్తారు. గత 13 ఏళ్లలో ఆయన అతివేగం కారణంగా సుమారు రూ. 3.7 కోట్ల జరిమానాలు చెల్లించడం గమనార్హం.