తాగునీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండ పట్టణ సమీపంలోని పానగల్‌లో గల తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేసి నల్గొండ పట్టణానికి సరఫరా చేస్తున్న తాగునీటి వివరాలు, నీటి శుద్ధి వివరాలను మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంశీకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి తదితరులు ఉన్నారు.