కార్మికుడి కుటుంబానికి బాలకృష్ణ భరోసా

కార్మికుడి కుటుంబానికి బాలకృష్ణ భరోసా

AP: విధి నిర్వహణలో విద్యుత్ షాక్‌కు గురై మరణించిన కార్మికుడి కుటుంబానికి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. బాధిత కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయన మానవత్వంతో స్పందించారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని బాలయ్య మరోసారి చాటుకున్నారు.