సందర్శకులతో కిక్కిరిసిన నాంపల్లి నుమాయిష్

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసింది. ఒక్కరోజే 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ వెల్లడించారు. వివిధ స్టాళ్ల వద్ద తమకు నచ్చినవి కొనుగోలు చేస్తూ పిల్లలతో సరదాగా గడిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో ప్రజలు ఆసక్తి కనబరిచారు.