VIDEO: మహిళల జోలికి వస్తే సహించేది లేదు: డీఎస్పీ
GNTR: మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ బి.వి. మధుసూధన రావు హెచ్చరించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే 112 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్ శాఖ స్పందించి బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు.