VIDEO: నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు.!
MDK: రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమైంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. మొత్తం 16 గ్రామ పంచాయతీలకు గాను అధికారులు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు.