శ్రీనివాస కళ్యాణం కార్యక్రమానికి మంత్రికి ఆహ్వానం

ATP: ధర్మవరం పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ప్రభుత్వ కాలేజీ ఆవరణలో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం ఈనెల 19న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర చేనేత మంత్రి శ్రీ మతి సవితను ధర్మవరం పట్టణానికి చెందిన గోర్తి సుధాకర్ నాయుడు, శ్రీమతి గోర్తి భారతి దేవి దంపతులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.