'శాంతియుతంగా సంబరాలు చేసుకోండి'

'శాంతియుతంగా సంబరాలు చేసుకోండి'

GNTR: వినాయక చవితి వేడుకలను నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సూచించారు. పాతగుంటూరు స్టేషన్‌లో మంగళవారం వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో డీఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా లౌడ్ స్పీకర్లు, రాజకీయాలకు సంబంధించిన పాటలు పెట్టొద్దని చెప్పారు. 24 గంటలు విగ్రహం వద్ద ఒకరు ఉండాలని చెప్పారు.