కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

NLR: ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చుక్కల దుప్పి వచ్చింది. మచ్చల జింకను గమనించిన కుక్కలు దానిని వెంటాడి గాయపరిచాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన దుప్పి మృతి చెందడం గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి చుక్కల దుప్పి వచ్చినట్లు తెలుస్తుందని అన్నారు.