రైతులకు ఎరువుల సరఫరా కార్డుల పంపిణీ

రైతులకు ఎరువుల సరఫరా కార్డుల పంపిణీ

SRPT: సహకార సంఘం పరిధిలోని రైతులు ఎరువుల సరఫరా కార్డులను సద్వినియోగం చేసుకోవాలని గడ్డిపల్లి PACS ఛైర్మన్ గంటా సుధాకర్ రెడ్డి కోరారు. గడ్డిపల్లిలో సోమవారం సహకార సంఘం కార్యాలయంలో ఎరువుల సరఫరా కార్డులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఈ ఎరువుల సరఫరా కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.