'జేవీవీ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి'

కడప: నగరంలో జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు B విశ్వనాథ్ తెలిపారు. జూలై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలకు సంబంధించి జేవీవీ పోరాడుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి తమ వేదిక ప్రధానంగా కృషి చేస్తోందని చెప్పారు.