భద్రాద్రి రాములోరి పెళ్లికి చీరాల గోటి తలంబ్రాలు
BDK: భద్రాద్రి రామయ్య కల్యాణానికి 13 ఏళ్లుగా గోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. పొత్తూరి సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పండించిన ధాన్యాన్ని మహిళలు చేతులతో సిద్ధం చేస్తున్నారు. 2014లో 500 కిలోలతో మొదలైన ఈ సేవ ఇప్పుడు 25 వేల కిలోలకు పెరిగింది. శ్రీరామనవమి రోజున వీటిని వినియోగించి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.